టీ-20ల్లో అత్యధిక పరుగుల తేడాతో (172) గెలిచిన దేశంగా శ్రీలంక పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది రొమేనియా జట్టు. రొమేనియా కప్లో టర్కీతో జరిగిన మ్యాచ్లో 173 పరుగుల తేడాతో విజయం సాధించింది. తమిళనాడులో పుట్టిన శివకుమార్ పెల్వియార్ (105, 40 బంతుల్లో) శతకంతో అదరగొట్టి రొమేనియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన రొమేనియా నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన టర్కీ 53 పరుగులకే ఆలౌటైంది. రాజేంద్ర పిసాల్, కాస్మిన్ జేవియూ చెరో మూడు వికెట్లతో ఆకట్టుకున్నారు.
అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన టాప్ -5 జట్లు
విజేత | ప్రత్యర్థి | పరుగుల తేడా | సంవత్సరం |
రొమేనియా | టర్కీ | 173 | 2019 |
శ్రీలంక | కెన్యా | 172 | 2007 |
పాకిస్థాన్ | వెస్టిండీస్ | 143 | 2018 |
భారత్ | ఐర్లాండ్ | 143 | 2018 |
ఇంగ్లాండ్ | వెస్టిండీస్ | 137 | 2019 |