క్రీడారంగం అంటే మ్యాచ్లు, పోటీలు, టైటిల్స్, పతకాలు, విజేతలు. అయితే ఓ మ్యాచ్ లేదా టోర్నీ నిర్వహించాలంటే సాధారణ విషయం కాదు. దాని వెనుక క్షేత్రస్థాయి నుంచి చాలామంది సిబ్బంది పనిచేస్తారు. ఇందులో కోచ్లు, అంపైర్లు, రిఫరీలు, మాజీ ఆటగాళ్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతరత్రా సిబ్బంది ఉంటారు. అలాంటిది కొంతకాలం నుంచి విజృంభిస్తోన్న కరోనా వల్ల అన్ని పోటీలు నిలిచిపోయాయి. దీంతో వారంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వీరందరిని ఆదుకునేందుకు భారత ప్రముఖ ఆటగాళ్లు ముందుకొచ్చారు. విరాళాలు సేకరించేందుకు 'ప్లే ఫర్ ఇండియా' కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా వచ్చిన విరాళాలతో వారికి సహాయపడనున్నారు.
#ప్లే ఫర్ ఇండియాకు భారత స్టార్ ఆటగాళ్ల మద్దతు
కరోనా వల్ల ఆదాయం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న క్రీడా సిబ్బంది కోసం, దేశంలోని ప్రముఖ క్రీడాకారులు ముందుకొచ్చారు. 'ప్లే ఫర్ ఇండియా' కార్యక్రమం ద్వారా విరాళాలు సేకరించి వారిని ఆదుకోనున్నారు.
ప్లే ఫర్ ఇండియా ఇనీషియేటివ్
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారిలో క్రికెటర్లు రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, స్మృతి మంధాన, మయాంక్ అగర్వాల్, భజరంగ్ పునియా, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్, సానియా మీర్జాలతో పాటు బాలీవుడ్ స్టార్స్ అభిషేక్బచ్చన్, సునీల్ శెట్టి ఉన్నారు.
ఇది చూడండి : రోహిత్ శర్మను అమ్మాయిగా మార్చేసిన చాహల్!