తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ రికార్డు సాధించిన మూడో క్రికెటర్ రోహిత్ శర్మ - రోహిత్ శర్మ రికార్డు

అంతర్జాతీయ వన్డే క్రికెట్​లో అత్యంత వేగంగా 9000 పరుగులు మైలురాయిని అందుకున్న మూడో క్రికెటర్​గా నిలిచాడు రోహిత్ శర్మ. బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఈ ఘనత సాధించాడు.

ఆ రికార్డు సాధించిన మూడో వాడు రోహిత్ శర్మ
భారత క్రికెటర్ రోహిత్ శర్మ

By

Published : Jan 19, 2020, 6:53 PM IST

టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ.. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్​లో అత్యంత వేగంగా 9000 పరుగులు చేసిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్​లో రెండు పరుగులతో ఖాతా తెరిచి ఈ రికార్డు సృష్టించాడు.

ఈ జాబితాలో కోహ్లీ(194) అగ్రస్థానంలో ఉన్నాడు. డివిలియర్స్(208), రోహిత్ శర్మ(217), సౌరభ్ గంగూలీ(228), సచిన్‌ తెందుల్కర్‌(235), బ్రియన్‌ లారా(239) వరుసగా ఉన్నారు.

గతేడాది రోహిత్ వీరోచిత ఫామ్‌లో ఉన్నాడు. ఏకంగా 7 శతకాలు బాదాడు. అందులో ఐదు ప్రపంచకప్‌లోనే చేశాడు. ఆ ఏడాదికి వన్డేల్లో అత్యధిక పరుగుల వీరుడి రికార్డూ అందుకున్నాడు. తాజాగా ఐసీసీ అతడికి 'వన్డే క్రికెటర్‌' గానూ నిలిచాడు.

ABOUT THE AUTHOR

...view details