మహేంద్రసింగ్ ధోనీ వారసుడిగా భారత జట్టులో అడుగుపెట్టిన రిషభ్ పంత్ వరుస వైఫల్యాలతో సతమతమవుతూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ అంశంపై టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ స్పందించాడు. మహీని భర్తీ చేయాలనే ఆలోచనతో పంత్ ఒత్తిడికి లోనవుతున్నాడని అన్నాడు.
"ప్రస్తుతం రిషభ్ పంత్ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు అతడికి మంచి అవకాశాలు కావాలి. ఈ విషయంపై ఇప్పటికే జట్టు యాజామాన్యంతో చర్చించా. పంత్ ప్రతిభ గల ఆటగాడు. ధోనీతో పోల్చడం వల్ల ఒత్తిడికి గురవుతున్నాడు." -ఎమ్ఎస్కే ప్రసాద్, టీమిండియా ప్రధాన సెలక్టర్.
పంత్ తిరిగి పుంజుకుంటాడన్న ఆత్మవిశ్వాసం తనకుందని చెప్పాడు ఎమ్ఎస్కే ప్రసాద్.