తెలంగాణ

telangana

ETV Bharat / sports

"యువీకి ప్రేమతో....": సహచరుల ఘన వీడ్కోలు

అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్​మెంట్​ ప్రకటించిన యువరాజ్​ సింగ్​ను కొనియాడుతూ పలువురు క్రికెటర్లు ట్వీట్​ చేశారు. క్రికెట్​ లెజెండ్​ సచిన్​, టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ సహా ఇతర దేశాల ఆటగాళ్లు యువీపై ప్రశంసల జల్లు కురిపించారు.

"యువీకి ప్రేమతో....": సహచరుల ఘన వీడ్కోలు

By

Published : Jun 10, 2019, 8:56 PM IST

అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్​మెంట్ ప్రకటించిన యువరాజ్​ సింగ్​ సేవలను ప్రశంసిస్తూ పలువురు క్రీడాకారులు ట్విట్టర్​లో స్పందించారు.

"యువీ... నీది ఎంతో అద్భుతమైన క్రీడా జీవితం. జట్టుకు అవసరమైన ప్రతిసారి నిజమైన ఛాంపియన్​లా ఆదుకున్నావు. మైదానంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఒడుదొడుకులు ఎదుర్కొని చక్కని పోరాట పటిమ ప్రదర్శించావు. నూతన జీవితం బాగుండాలని కోరుకుంటున్నా. క్రికెట్లో నీ సేవలకు ధన్యవాదాలు."
-సచిన్​ తెందూల్కర్​.

"ఎంతోమంది ఆటగాళ్లు వస్తుంటారు వెళ్తుంటారు. యువరాజ్​ లాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఎన్నో కష్టాలను అధిగమించాడు. ఆరోగ్య సమస్యను, బౌలర్లను దీటుగా ఎదుర్కొని ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నాడు. తన పోరాటం, సంకల్పంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. జీవితం బాగుండాలని కోరుకుంటున్నా."
-వీరేంద్ర సెహ్వాగ్, భారత మాజీ క్రికెటర్​.

" భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి అద్భుత ఆటతీరు ప్రదర్శించినందుకు అభినందనలు పాజీ. ఎన్నో జ్ఞాపకాలు మరెన్నో విజయాలను అందించావు. భవిష్యత్తులో సంతోషంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నా. నిజమైన ఛాంపియన్​."
-విరాట్​ కొహ్లీ.

"సంతోషకరమైన వీడ్కోలు. ఎత్తులు, పల్లాలు చూసిన గొప్ప క్రీడా జీవితం. నీలి దుస్తుల్లో సవాళ్లను ఎదుర్కొని సత్తా చాటి స్వచ్ఛమైన నైపుణ్య ఆటతీరుతో ఆకట్టుకున్నావు. ప్రేమతో.."
-కెవిన్ పీటర్సన్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్.

"అద్భుతమైన క్రీడా జీవితానికి యువీకి అభినందనలు. నిర్ణీత ఓవర్ల క్రికెట్​లో భారత అత్యుత్తమ ఆటగాడివి నువ్వే. యువీ గౌరవార్థం 12వ నంబర్​ జెర్సీకి బీసీసీఐ వీడ్కోలు ప్రకటించాలి."
-గౌతం గంభీర్.​


"యువీ పాజీ మీ సలహాలు, సూచనలు, ప్రేమకు కృతజ్ఞతలు. నేను చూసిన అత్యుత్తమ ఎడమ చేతి వాటం బ్యాట్స్​మన్​ మీరే. మీ బ్యాటింగ్​ శైలి నుంచి ఎంతో నేర్చుకున్నా. నూతన జీవిత ప్రయాణంలో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నా."
-శిఖర్ ధావన్​.

"ప్రపంచ ఛాంపియన్​ నిన్ను మిస్​ అవుతున్నాం. దేశానికి ఎన్నో గొప్ప విజయాలు అందించావ్​. మీ భవిష్యత్తు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా."
-సైనా నెహ్వాల్​, బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి.

"ఒక సోదరుడు, ఒక మెంటర్​, ఓ పోరాట యోధుడు. లెజెండ్​ ఆటగాడు. గొప్ప వ్యక్తిత్వం గలవాడు. యువరాజ్​ సింగ్ భవిష్యత్తు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నా."
-రిషబ్​ పంత్​.

"యువరాజ్​తో కలిసి ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా ఉంటావు. నీవు ఆట పట్ల చూపిన ప్రేమ, అంకితభావం ఎంతో మందికి ఆదర్శం."
-వీవీఎస్ లక్ష్మణ్​, భారత్ మాజీ క్రికెటర్​.

" క్రికెట్ చరిత్రలో గొప్ప మ్యాచ్​ విన్నర్లలో ఒకడు. కఠిన సవాళ్లను ఎదుర్కొని విజేతగా నిలిచావు. నిన్ను చూసి గర్విస్తున్నాం."
-మహ్మద్ కైఫ్, భారత మాజీ క్రికెటర్​.

"ఒక శకం ముగిసింది. యూవీ పా, మీ బ్యాటింగ్​ సామర్థ్యం, అద్భుతమైన సిక్సర్లు, సూపర్​ క్యాచ్​లు ఇక చూడబోము. మీరు, మీ ఆటతీరు మాకు ఆదర్శం. ధన్యవాదాలు."
-సురేశ్ రైనా, భారత క్రికెటర్​.

ఇదీ చూడండి: సిక్సర్ల 'యువరాజు' భావోద్వేగ వీడ్కోలు

ABOUT THE AUTHOR

...view details