తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సౌతాఫ్రికాతో మ్యాచ్​కు రషీద్ ఫిట్'​ - afghnistan

దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్​కు అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్​ అందుబాటులో ఉండనున్నాడు. అతడు గాయం నుంచి కోలుకుంటున్నాడని ఆ జట్టు సారథి గుల్బదిన్ నయీబ్ తెలిపాడు.

రషీద్

By

Published : Jun 9, 2019, 1:55 PM IST

న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో గాయపడ్డ అఫ్గానిస్థాన్ స్పిన్నర్​ రషీద్ ఖాన్​ కోలుకుంటున్నాడని జట్టు తెలిపింది. దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్​కు అందుబాటులో ఉంటాడని ప్రకటించింది.

కివీస్​తో జరిగిన మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసింది అఫ్గానిస్థాన్. న్యూజిలాండ్ బౌలర్ ఫెర్గూసన్ వేసిన బంతి రషీద్ ఖాన్ తలకు తగిలింది. వైద్య పరీక్షలు చేసిన అనంతరం రషీద్​కు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు.

"న్యూజిలాండ్​తో మ్యాచ్​లో రషీద్​ ఫీల్డింగ్​కు వెళ్లవద్దని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం అతడు పూర్తి ఫిట్​గా ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్​కు ఇంకా రెండు రోజుల సమయముంది. అప్పటివరకు రషీద్ పూర్తిగా కోలుకుంటాడు".
--గుల్బదిన్ నయీబ్, అఫ్గాన్ సారథి

ప్రపంచకప్​లో ఆడిన మూడు మ్యాచ్​ల్లో ఓడి నిరాశలో కూరుకుపోయింది అఫ్గాన్. ఇప్పటికే ఆ జట్టు విధ్వంసకర బ్యాట్స్​మన్ మహ్మద్ హెజాద్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.

ఇవీ చదవండి.. డివిలియర్స్​పై అక్తర్​​ మండిపాటు

ABOUT THE AUTHOR

...view details