తెలంగాణ

telangana

ETV Bharat / sports

పొట్టిఫార్మాట్లో రషీద్ ఖాన్ మూడో హ్యాట్రిక్ - Bigbash League 2020 Rashid hatric

బిగ్​బాష్​ లీగ్​లో సిడ్నీ సిక్సర్​తో మ్యాచ్​లో అడిలైడ్ జట్టు బౌలర్ రషీద్ ఖాన్ హ్యాట్రిక్​తో ఆకట్టుకున్నాడు. తన టీ20 కెరీర్​లో మూడోసారి ఈ ఘనత సాధించాడు.

Rashid Khan's 3rd T20 hat-trick in vain as Sydney Sixers beat Adelaide Strikers in BBL clash
రషీద్ ఖాన్

By

Published : Jan 8, 2020, 3:13 PM IST

హ్యాట్రిక్ వికెట్లు తీయడమనేది ఏ బౌలర్​కైనా మంచి గుర్తింపు. అయితే ఓసారి తీస్తేనే గొప్ప బౌలరని ప్రశంసిస్తారు. అలాంటిది ఏకంగా మూడుసార్లు ఈ ఘనత సాధించాడు ఆఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్. బిగ్​బాష్​లీగ్​లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆడుతున్న రషీద్.. టీ20ల్లో మూడోసారి హ్యాట్రిక్ తీసి ఆకట్టుకున్నాడు. గతంలో ఐపీఎల్, సీపీఎల్​లో హ్యాట్రిక్ వికెట్లతో ఆకట్టుకున్నాడు రషీద్ ఖాన్.

అడిలైడ్ వేదికగా సిడ్నీసిక్సర్స్​తో బుధవారం జరిగిన మ్యాచ్​లో వరుసగా మూడు వికెట్లు తీశాడు రషీద్. పదో ఓవర్ ఐదో బంతికి జేమ్స్​ విన్స్​ను ఔట్ చేసి​.. తర్వాతి బంతికే జాక్ ఎడ్వర్డ్స్​ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. అనంతరం 12వ ఓవర్లో బౌలింగ్​కొచ్చిన ఆఫ్గాన్ స్పిన్నర్ మొదటి బంతికే జోర్డాన్ సిల్క్​ను బౌల్డ్ చేసి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.

4 ఓవర్లలో 22 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు రషీద్. అయితే ఈ మ్యాచ్​లో సిడ్నీ సిక్సర్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన అడిలైడ్ 19.4 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌట్​ కాగా.. అనంతరం లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది సిడ్నీ.

ఇదీ చదవండి: సైనా రెండో రౌండ్​కు.. శ్రీకాంత్ ఇంటికి

ABOUT THE AUTHOR

...view details