తెలంగాణ

telangana

ETV Bharat / sports

రషీద్ ​ఖాన్​ అరుదైన ఘనత - టెస్టుల్లో తొలిసారిగా ఐదు వికెట్ల ఘనత సాధించిన రషీద్ ఖాన్

ఆఫ్గానిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్... ఆ దేశం తరఫున టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు. ఒకే ఇన్నింగ్స్​​లో ఐదు వికెట్లు తీసిన తొలి అఫ్గాన్​ బౌలర్​గా నిలిచాడు.

టెస్టుల్లో తొలిసారిగా ఐదు వికెట్ల ఘనత సాధించిన రషీద్ ఖాన్

By

Published : Mar 18, 2019, 7:00 AM IST

దేహ్రాడూన్ వేదికగా ఐర్లాండ్​తో జరుగుతున్న టెస్టు మ్యాచ్​లో రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. ఒకే ఇన్నింగ్స్​​లో ఐదు వికెట్లు తీసిన తొలి ఆఫ్గాన్ బౌలర్​గా నిలిచాడు.

టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట​లో ఈ మిస్టరీ స్పిన్నర్ ధాటికి రెండో ఇన్నింగ్స్​లో 288 పరుగులకే ఐర్లాండ్ ఆలౌటైంది. జేమ్స్ మెక్​కల్లమ్, కెవిన్ ఒబ్రయిన్, స్టువర్ట్ థామ్సన్, జార్జ్ డార్క్రెల్, ఆండీ మెక్​బ్రియన్.. రషీద్​ బౌలింగ్​ను అర్థం చేసుకోలేక పెవిలియన్ బాట పట్టారు.

రెండో ఇన్నింగ్స్​లో బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్గాన్ జట్టు 29 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. విజయానికి ​118 పరుగుల దూరంలో ఉంది.

మొదటి ఇన్నింగ్స్​లో ఐర్లాండ్... వికెట్లన్నీ పోగొట్టుకని 172 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ జట్టు 314 పరుగులు చేసింది.

ABOUT THE AUTHOR

...view details