తెలంగాణ

telangana

ETV Bharat / sports

యాషెస్ సిరీస్​: తొలిరోజు వరుణుడిదే.. - england

లార్డ్స్​ వేదికగా జరుగుతున్న యాషెస్​ సిరీస్​ రెండో టెస్టులో తొలి రోజు వర్షార్పణమైంది. ఒక్క బంతి కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. సిరీస్ 1-0తో ముందంజలో ఉంది కంగారూ జట్టు.

యాషెస్​

By

Published : Aug 15, 2019, 8:30 AM IST

Updated : Sep 27, 2019, 1:53 AM IST

యాషెస్ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు వర్షం కారణంగా తుడిచి పెట్టుకుపోయింది. లార్డ్స్​ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో ఒక్క బంతి కూడా పడలేదు. టాస్ వేసేందుకూ వీలు పడలేదు.

పదే పదే వరణుడు అడ్డుపడుతూ.. మ్యాచ్​ నిర్వహణకు కష్టంగా మారాడు. ఐదు రోజుల ఆటలో ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

తొలి టెస్టులో అనూహ్యంగా పుంజుకున్న ఆసీస్​.. 251 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆ టెస్టులో మొదటి మూడు రోజులు ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లాండ్​.. చివరి రెండు రోజుల్లో విఫలమై మ్యాచ్​ను కంగారూ జట్టు చేతిలో పెట్టింది.

ఇది చదవండి: భారత్​దే సిరీస్​.. కోహ్లీ ఖాతాలో మరో సెంచరీ

Last Updated : Sep 27, 2019, 1:53 AM IST

ABOUT THE AUTHOR

...view details