రాహుల్ ద్రవిడ్‌ను మిస్టర్ డిపెండబుల్, ది వాల్ అని కీర్తిస్తుంటారు అభిమానులు. బ్యాటింగ్‌కు దిగాడంటే బౌలర్ల సహనానికి పరీక్షే. అతడి ఆటతీరుకి ఫిదా అవ్వని క్రికెట్ ఫ్యాన్స్ ఉండరు. బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ ద్రవిడ్‌ది ప్రత్యేక బాటే. ఎక్కువగా స్లిప్, గల్లీల్లో పీల్డింగ్ చేసే ఈ ఆటగాడు క్యాచ్‌లు పట్టడంలోనూ దిట్ట. అందుకు సాక్ష్యం ఈ వీడియోనే. తాజాగా స్పిన్నర్ హర్భజన్ సింగ్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు పట్టిన అద్భుత క్యాచ్‌లకు నెటిజన్లతో పాటు క్రికెటర్లు ఫిదా అవుతున్నారు. అద్భుతం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
వైరల్ వీడియో: ద్రవిడ్ క్యాచ్ పడితే అంతే! - వైరల్ వీడియో: ద్రవిడ్ క్యాచ్ పడితే అంతే!
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ బ్యాటింగ్‌లోనే కాక ఫీల్డింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చేవాడు. ఇతడు పట్టిన క్యాచ్‌లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ద్రవిడ్
టీమ్ఇండియా తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా ద్రవిడ్‌కు రికార్డుంది. మొత్తం 504 మ్యాచ్‌ల్లో 333 క్యాచ్‌లు పట్టాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లలో ద్రవిడ్‌ది నాలుగో స్థానం. ఇతడికంటే ముందు జయవర్ధనే (శ్రీలంక), పాంటింగ్ (ఆస్ట్రేలియా), జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) ఉన్నారు.