భారత అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మన్ ఎవరు? అని విజ్డెన్ ఇండియా నిర్వహించిన పోల్‌లో దిగ్గజ సచిన్‌ను అధిగమించాడు మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. మొత్తం వేసిన 11,400 ఓట్లలో ద్రవిడ్ 52 శాతం దక్కించుకుని విజేతగా నిలిచాడు. ఇతడి తర్వాతి స్థానాల్లో సచిన్, గావస్కర్, కోహ్లీ నిలిచారు.
ముందుతరంలో ఆడిన సచిన్, ద్రవిడ్.. ప్రపంచ ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. వన్డేల్లో, టెస్టులో చెరో 10 వేలకుపైగా పరుగులు చేశారు. అయితే ద్రవిడ్ డిఫెన్సివ్‌గా ఆడి పేరు తెచ్చుకోగా, సచిన్ మాత్రం అద్భుతమైన స్ట్రోక్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. వీరిద్దరూ భారత జట్టుకు కెప్టెన్‌గానూ కొంతకాలం పనిచేశారు.