తెలంగాణ

telangana

టీమిండియా క్రికెటర్​ ఫృథ్వీషాపై సస్పెన్షన్ వేటు

By

Published : Jul 30, 2019, 8:58 PM IST

Updated : Jul 30, 2019, 9:11 PM IST

నిషేధిత డ్రగ్​ను తీసుకున్న కారణంగా టీమిండియా క్రికెటర్​ ఫృథ్వీషా.. 8 నెలల తాత్కలిక సస్పెన్షన్​కు గురయ్యాడు.

టీమిండియా క్రికెటర్​ ఫృథ్వీషా సస్పెండ్

టీమిండియా టెస్టు క్రికెటర్​ ఫృథ్వీషా డోపింగ్ పరీక్షలో విఫలమైన కారణంగా 8 నెలల తాత్కాలిక నిషేధానికి గురయ్యాడు. ఇతడితో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. బీసీసీఐ సంబంధిత ప్రకటనను విడుదల చేసింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా ఈ ముగ్గురు క్రికెటర్ల నుంచి సేకరించిన యూరిన్ శాంపిల్స్​లో నిషేధిత డ్రగ్స్​ వాడినట్లు తేలింది.

క్రికెటర్ ఫృథ్వీషా

ఫృథ్వీషా తీసుకునే దగ్గు మందులో ఉన్న టెర్​బుటలైన్​ అనే కారకం వాడా నిషేధిత జాబితాలో ఉంది. బీసీసీఐ యాంటీ డోపింగ్ నియమాల ప్రకారం అతడ్ని సస్పెండ్​ చేశారు. ఆ తర్వాత వివరణ ఇచ్చిన షా.. సిరప్ వేసుకునే క్రమంలో తనకు తెలియకుండా దీన్ని తీసుకున్నానని చెప్పాడు. ఈ విషయంపై సంతృప్తి చెందిన బీసీసీఐ, అతడికి 8 నెలల తాత్కాలిక నిషేధం విధించింది. ఈ ఏడాది నవంబరు 15 వరకు ఇది అమలులో ఉండనుంది.

ఇది చదవండి: భారత్​ అమ్మాయితో పాక్​ క్రికెటర్ హసన్ అలీ పెళ్లి..!

Last Updated : Jul 30, 2019, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details