ఐపీఎల్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ వికెట్ తీస్తే ఒకప్పటి దక్కన్ ఛార్జర్స్ యజమాని ఒకరు బహుమతి ఇస్తానని తనతో చెప్పాడని టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఓజా నాటి మ్యాచ్‌లో నిజంగానే మాస్టర్‌ను ఔట్ చేశానని చెప్పాడు.
"అది 2009 ఐపీఎల్‌లో డర్బన్ వేదికగా ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు రోజు. ఆ టోర్నీలో నేను మంచి ప్రదర్శన చేస్తుండటం చూసి మా యజమాని వచ్చి నాతో ఇలా అన్నాడు. 'రేపు నువ్వు సచిన్ వికెట్ తీస్తే నీకో బహుమతి ఇస్తా'అని చెప్పాడు. నేను చిన్నప్పటి నుంచి ఆయనకు తెలుసు. అలాగే నాకు వాచ్‌లంటే ఇష్టమనీ తెలుసు. దాంతో సచిన్ వికెట్ తీస్తే నాకో వాచ్ ఇవ్వమని అడిగా. తర్వాతి రోజు నిజంగానే మాస్టర్‌ను ఔట్ చేయడం వల్ల ఆయన నాకు వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడు."