కరోనా కారణంగా ఆర్థిక భారాన్ని మోస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్ కోసం స్పాన్సర్‌ను వెతకడంలో విఫలమైంది. పాక్ జట్టు లోగో స్పాన్సర్షిప్ ఒప్పందంపై సంతకం చేయడానికి ఓ పానీయ సంస్థతో చర్చలు కొనసాగుతున్నాయని ఓ పీసీబీ అధికారి తెలిపాడు. సదరు సంస్థ విశ్లేషకుల అంచనాల కంటే చాలా తక్కువ మొత్తానికి టెండర్ వేసిందని తెలుస్తోంది.
"పానీయాల సంస్థతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒప్పందం ఇటీవలే ముగిసింది. పాకిస్థాన్ జాతీయ జట్టుకు సంబంధించిన ప్రధాన లోగో స్పాన్సర్షిప్ ఒప్పందం కోసం తాజాగా వేలానికి ఆహ్వానించాం. కానీ, ఆ పానీయ సంస్థ తప్ప ఎవరూ వేలంలో పాల్గొనలేదు. ఇది మా ముందున్న సమస్య. కానీ, చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా బహుళజాతి కంపెనీలూ తీవ్రంగా నష్టపోయాయని అర్థమవుతుంద"ని పీసీబీ అధికారి వెల్లడించాడు.
బ్రాడ్కాస్ట్ ఒప్పందం