పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ యూనిస్ ఖాన్‌పై మాజీ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. బ్యాటింగ్‌లో సలహా ఇస్తే వినకుండా యూనిస్ తన మెడ మీద కత్తి పెట్టాడని ఆరోపించాడు గ్రాంట్ ఫ్లవర్. పాక్ జాతీయ జట్టుకు 2014 నుంచి 2019 వరకు దాదాపు ఐదేళ్లపాటు కోచ్‌గా పనిచేశాడు గ్రాంట్. యూనిస్ ఖాన్ ప్రస్తుతం పాక్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ ఆరోపణలపై పీసీబీ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. కానీ 2016లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బ్రిస్బేన్‌లో జరిగింది కేవలం స్నేహపూర్వక సంఘటన మాత్రమేనని ఆ బోర్డు అభిప్రాయపడుతున్నట్లు ఓ అధికారి తెలిపాడు.
"గ్రాంట్ చెప్పింది పూర్తిగా నిజం కాదు. యూనిస్ సరదాగా కత్తి పైకెత్తి అల్పాహార సమయంలో సలహా ఇవ్వొద్దని చెప్పిన మాటను గ్రాంట్ సీరియస్‌గా తీసుకున్నాడు. పాకిస్థాన్ జట్టుతో కలిసి పని చేసిన మాజీ కోచ్‌లు, సహాయక సిబ్బంది తమ ఒప్పందాలు ముగిసిన తర్వాత సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించడం బాధగా ఉంది. వారు వెలుగులోకి రావడానికి చిన్న విషయాలను పెద్దవిగా చేసి చూపిస్తున్నారు".