పాకిస్థాన్ జట్టుకు 2020-21 సీజన్‌కు గానూ వన్డేల్లో కొత్త కెప్టెన్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ దేశ క్రికెట్ బోర్డు. యువ క్రికెటర్ బాబర్ అజామ్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే అజామ్ టీ20 జట్టుకు సారథిగా ఉన్నాడు. ఇప్పుడు పరిమిత ఓవర్ల కెప్టెన్సీని పూర్తిగా బాబర్‌కు అప్పజెప్పుతూ పీసీబీ ప్రకటన చేసింది. టెస్టు జట్టుకు అజర్ అలీని సారథిగా కొనసాగిస్తున్నారు.
"అజర్ అలీ, బాబర్ అజామ్‌లకు అభినందనలు. వారు భవిష్యత్‌లో నిర్వర్తించే బాధ్యతలపై నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయం. వారిద్దరూ భవిష్యత్ ప్రణాళికలు రచించి జట్టును ఉన్నతంగా నిలుపుతారని ఆశిస్తున్నాం."