కరోనా సంక్షోభంతో అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. బీసీసీఐపైనా తాజాగా దీని ప్రభావం పడింది. మార్చి నుంచి వైరస్ ఎఫెక్స్ ఉన్నా, బోర్డు మాత్రం సిబ్బందిని తొలగించడం, ఆటగాళ్ల జీతాలను తగ్గిండం లాంటివి చేయలేదు. కానీ ఇప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, ఆటగాళ్లకు వేతనాల్లో కోత విధింపుపై బోర్డు త్వరలో సమావేశమయ్యే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
"మేం ఇప్పటి వరకు జీతాల్లో కోత విధింపుపై చర్చించలేదు. త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి, ఈ ప్రభావం ఎంతమేరకు ఉంటుందో పరిశీలిస్తాం. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తుది నిర్ణయం తీసుకుంటాం. ఉద్యోగుల తొలగింపు కూడా ఉండే అవకాశం ఉంది.