దిగ్గజ సచిన్ తెందుల్కర్ వంద సెంచరీల మార్క్‌ను దాటే సత్తా టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీకి ఉందని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. రానున్న కాలంలో విరాట్ మరిన్ని రికార్డులను అధిగమిస్తాడని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
"సచిన్‌లా వంద సెంచరీలు చేయగల సత్తా కోహ్లీలో ఉంది. ఆ విషయం నాకే కాదు మీకూ తెలుసు. క్రికెట్లో అతి తక్కువ సమయంలోనే ఎన్నో రికార్డులను విరాట్ అధిగమించాడు. అయితే మాస్టర్ ఘనతను తిరిగి మరో భారతీయుడే అధిగమించాలని.. అతడు కోహ్లీనే కావాలని ఆశిస్తున్నా. ఇప్పటివరకు 70 శతకాలు చేశాడు. మరో 30 సెంచరీలు మాత్రమే చేయాల్సి ఉంది. రిటైరయ్యే లోపే కోహ్లీ ఈ ఘనత సాధిస్తాడని నమ్ముతున్నా. నూరు శతకాలు చేయడమే అతడి లక్ష్యమని అనుకుంటున్నా"