తెలంగాణ

telangana

ETV Bharat / sports

హే పంత్.. ఆటపై దృష్టిపెట్టు: రహానె - హే పంత్.. ఆటపై దృష్టిపెట్టు

భారత యువ వికెట్​కీపర్​ రిషభ్​ పంత్​కు పలు సూచనలు ఇచ్చాడు టీమిండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె. తన ఆటను మరింత మెరుగుపరచుకోవాలని చెప్పాడు.

panth
హే పంత్.. ఆటపై దృష్టిపెట్టు

By

Published : Feb 20, 2020, 1:49 PM IST

Updated : Mar 1, 2020, 10:57 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా పేరు తెచ్చుకున్న యువ వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ పేలవమైన ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా అతడికి పలు సూచనలు ఇచ్చాడు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె. ప్రస్తుతం పంత్..​ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడని, ఈ విషయాన్ని అతడు అంగీకరించి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని అన్నాడు.

"ప్రస్తుతం నీవు ఎదుర్కొంటున్న పరిస్థితిని అంగీకరించాలి. ఇది నీకు చాలా ముఖ్యం. సానుకూల దృక్పథంతో ముందుకుసాగుతూ మిగతా ఆటగాళ్ల నుంచి వీలైనన్ని విషయాలను నేర్చుకోవాలి"

-అజింక్య రహానె, వైస్‌ కెప్టెన్‌.

ఆటపై మరింత శ్రద్ధ, శ్రమ పెట్టి ఓ పరిణతి చెందిన క్రికెటర్​గా ఎదగాలని పంత్​కు సూచించాడు రహానె. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పాడు.

ఐదు నెలల క్రితం వరకు పంత్​కు విరివిగా అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సరైన ప్రదర్శన చేయకుండా నిరాశపర్చాడు. అందుకే అతడి స్థానంలో పరిమిత ఓవర్లలో వికెట్​ కీపర్​గా రాహుల్​, టెస్టుల్లో వృద్ధిమాన్‌ సాహాకు అవకాశం ఇచ్చింది యాజమాన్యం. ​

ఇదీ చూడండి :పాక్ క్రికెటర్ తప్పుడు ట్వీట్.. ట్రోల్ చేసిన నెటిజన్లు

Last Updated : Mar 1, 2020, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details