పాకిస్థాన్ క్రికెట్లో మరోసారి ఫిక్సింగ్ భూతం కలకలం రేపింది. ఇప్పటికే మహ్మద్ ఆమిర్, సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్ లాంటి ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్ బారిన పడ్డారు. తాజాగా ఆ జట్టు సీనియర్ క్రికెటర్ నాసిర్ జంషెడ్(33) స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ నార్త్‌వెస్ట్ కోర్టు తేల్చింది.
2016 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో, 2017 పాకిస్థాన్ సూపర్ లీగుల్లో పేలవ ప్రదర్శన చేసేందుకు సహచరులకు నాసిర్ డబ్బు ఆశచూపినట్లు తేలింది. నాసిర్‌తో పాటు యూసఫ్ అన్వర్(36), మహ్మద్ లిజాజ్(34) కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు ఇవ్వనుంది న్యాయస్థానం.