పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ ఫవాద్ ఆలమ్ సంచలన రీతిలో జట్టులోకి ఎంపికయ్యాడు. దాదాపు పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. త్వరలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ కోసం అతడిని జట్టులోకి తీసుకున్నారు. దేశవాళీ క్రికెట్లో ఈ మధ్య కాలంలో భారీగా పరుగులు చేయడం వల్ల ఫవాద్‌ను ఎంపిక చేశామని పాక్ చీఫ్ సెలక్టర్, ప్రధాన కోచ్ మిస్బావుల్ హక్ అన్నాడు. బుధవారం రావల్పిండిలో తొలి టెస్టు ఆరంభమవుతుంది. రెండో మ్యాచ్‌కు కరాచీ వేదిక.
పదేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ
పాక్ క్రికెటర్ ఫవాద్ ఆలమ్.. స్వదేశంలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ కోసం ఎంపికయ్యాడు. 10 ఏళ్ల తర్వాత జట్టులోకి పునరాగమనం చేశాడు.
పాక్ క్రికెటర్ ఫవాద్ ఆలమ్
ఆలమ్ చివరిసారి 2009లో డ్యునెడిన్‌లో న్యూజిలాండ్‌పై ఆడాడు. శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరగడం వల్ల పాక్‌లో అంతర్జాతీయ క్రికెట్ నిలిచిపోయింది. 2009 జులైలో అతడు శ్రీలంకపై అరంగేట్రం చేసి శతకం బాదాడు. 16 ఏళ్ల తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 56.84 సగటుతో 12,222 పరుగులు సాధించడం విశేషం.