కేన్సర్‌తో పోరాడుతున్నపాకిస్థాన్ యువ క్రికెటర్ అసిఫ్ అలీ కూతురు నూర్ ఫాతిమా (2) అమెరికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫ్రాంఛైజీ ఇస్లామాబాద్ యునైటెడ్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది.
కేన్సర్‌తో యువ క్రికెటర్ కుమార్తె మృతి
పాకిస్థాన్ యువ క్రికెటర్ అసిఫ్ అలీ కూతురు నూర్ ఫాతిమా (2) కేన్సర్‌తో పోరాడుతూ మరణించింది.
తన కూతురు క్యాన్సర్‌తో బాధపడుతోందని ఆమె త్వరగా కోలుకునేందుకు దేవుడిని ప్రార్థించాలని గత ఏప్రిల్‌లోనే అసిఫ్ ట్విట్టర్‌లో అభిమానులను కోరాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్థాన్ జట్టుతో ఉన్న అసిఫ్.. కూతురి మరణవార్త తెలుసుకుని అమెరికా పయనమయ్యాడు. ఫాతిమా మృతిపై పాక్ ప్రజలు, క్రికెట్ అభిమానులు సానుభూతి తెలియజేస్తున్నారు.
ఇంగ్లండ్ సిరీస్‌లో రెండు అర్ధసెంచరీలతో రాణించాడు అసిఫ్. ఇప్పటివరకు 16 వన్డేలు ఆడి 31.09 సగటుతో 342 పరుగులు చేశాడు. పాకిస్థాన్ ప్రపంచకప్ తుది జట్టులో స్థానం దక్కనప్పటికీ ఇంకా ఆశలు లేకపోలేదు. తుదిజట్టును ప్రకటించడానికి మే 23 వరకు సమయముంది.