తెలంగాణ

telangana

ETV Bharat / sports

అరంగేట్రంలోనే పాక్ ఆటగాడి రికార్డు

పాకిస్థాన్​కు చెందిన యువ క్రికెటర్​ అబిద్​ అలీ.. అరుదైన ఘనత సాధించాడు. కెరీర్​ అరంగేట్రంలోనే తొలి టెస్టు శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా వన్డే, టెస్టు ఫార్మాట్​లో మొదటి మ్యాచ్​లోనే సెంచరీలు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

By

Published : Dec 15, 2019, 5:15 PM IST

Abid Ali creates history in Rawalpindi Test,
ప్రపంచ రికార్డు: అరంగేట్రంలోనే టెస్టు, వన్డేల్లో సెంచరీ

పాకిస్థాన్​ యువ క్రికెటర్ అబిద్​ అలీ​.. ప్రపంచ క్రికెట్​లో అరుదైన ఘనత సాధించాడు. అరంగేట్రంలోనే టెస్టు, వన్డే ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి పురుష క్రికెటర్​గా రికార్డులకెక్కాడు. శ్రీలంకతో రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో శతకం బాదడం ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ ఏడాది మార్చిలో దుబాయ్​ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్​ ఆడాడు అలీ​. ఇందులో 112 పరుగులు చేశాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన టెస్టులో 183 బంతుల్లో 100 పరుగులు(11 ఫోర్లు) సాధించాడు. ఈ రెండు సెంచరీలు ఒకే ఏడాది చేయడం విశేషం.

ఈ శతకంతో దాయాది దేశం దిగ్గజాల సరసన చేరాడు అబిద్. అరంగేట్రంలోనే సుదీర్ఘ ఫార్మాట్​లో సెంచరీ చేసిన 13వ పాకిస్థాన్​ క్రికెటర్​గా పేరు తెచ్చుకున్నాడు. గతంలో ఇలాగే సెంచరీలు చేసిన జావేద్​ మియాందాద్​, మహ్మద్​ వసీం, యూనిస్​ ఖాన్​, అలీ నవ్వీ సరసన నిలిచాడు.

గతంలో ఓ మహిళా క్రికెటర్​...

ఇంగ్లాండ్​కు చెందిన క్రికెటర్​ ఇనిద్​ బేక్​వెల్​ గతంలో ఇదే తరహా రికార్డు నెలకొల్పింది. 1968లో తొలి టెస్టు సెంచరీని నమోదు చేయగా.. 1973లో ఆడిన తొలి వన్డేలోనే శతకాన్ని సాధించింది. ఫలితంగా వన్డే, టెస్టు అరంగేట్రంలోనే సెంచరీ చేసిన తొలి క్రికెటర్​గా రికార్డులకెక్కింది.

దశాబ్దం తర్వాత పాక్​లో టెస్టు...

దశాబ్దం తర్వాత పాకిస్థాన్‌లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌ మ్యాచ్​ జరుగుతోంది. 2009లో శ్రీలంకపై ఉగ్రదాడి తర్వాత తొలిసారి మళ్లీ అదే జట్టు టెస్టు మ్యాచ్‌లకు అంగీకరించింది. ఏ జట్టుతో ఆడేటప్పుడు ఆఖరిగా స్వదేశంలో క్రికెట్‌ నిలిచిపోయిందో అదే లంకతో మళ్లీ సుదీర్ఘ ఫార్మాట్లో పాక్‌ తలపడబోతుండడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details