ఐపీఎల్ పోరు రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్స్‌లో చోటు సంపాదించుకోవడం కోసం అన్ని జట్లు శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లోని బౌలింగ్ గణంకాల్ని చూస్తే పేసర్లు 110 వికెట్లు తీసుకుని సత్తాచాటగా.. స్పిన్నర్లు 66 వికెట్లు తీసుకున్నారు. 13 మంది బౌలర్లు ఈ సీజన్లో 10 వికెట్ల కంటే ఎక్కువ తీసుకున్నారు. ఇందులో 8 మంది పేసర్లు కాగా, ఐదుగురు స్పిన్నర్లు ఉన్నారు.
ఐపీఎల్ అంటేనే స్పిన్నర్లకు వరం లాంటింది. ప్రతి సీజన్లో జట్టు గెలుపులో వారే కీలకపాత్ర పోషించారు. కానీ 12వ సీజన్లో స్పిన్నర్లను వెనక్కినెట్టారుపేస్ బౌలర్లు.
బౌలింగ్ విభాగంలో ఎక్కువ వికెట్లు తీసుకున్న వారిలో దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రబాడ ముందున్నాడు. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లాడి 23 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రబాడ సహా 10 వికెట్లకు పైగా తీసిన ఫాస్ట్ బౌలర్లు.. దీపర్ చాహర్ (15, చెన్నై సూపర్ కింగ్స్, షమీ (14, కింగ్స్ ఎలెవన్ పంజాబ్), బుమ్రా (13, ముంబయి ఇండియన్స్), మలింగ (12, ముంబయి ఇండియన్స్), క్రిస్ మోరిస్ (12, దిల్లీ క్యాపిటల్స్), జోఫ్రా ఆర్చర్ (11, రాజస్థాన్ రాయల్స్), సందీప్ శర్మ (10, సన్‌రైజర్స్ హైదరాబాద్).