ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ నిర్వహణపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. కొన్నాళ్లు పరిస్థితులు చూసిన తర్వాతే దీని గురించి ఆలోచిస్తామని సంబంధిత వర్గాలు చెప్పాయి.
ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ ఆలోచన ఏంటి? - DHONI KOHLI
కొన్నాళ్ల పరిస్థితి చూసిన తర్వాతే ఐపీఎల్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 15కు వాయిదా పడిందీ టోర్నీ.
ఐపీఎల్ 2020
షెడ్యూల్ ప్రకారం నిన్నే(మార్చి 29) ఈ టోర్నీ ప్రారంభం కావాల్సింది. కరోనా వల్ల ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. అయితే వైరస్ ప్రభావం ఎక్కువవుతుండటం వల్ల లీగ్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి.