తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​కు షాక్​... తొలి వన్డేలో న్యూజిలాండ్​ ఘన విజయం - cricket live

newzeland won first match aginst India
భారత్​కు షాక్​... తొలి వన్డేలో న్యూజిలాండ్​ ఘన విజయం

By

Published : Feb 5, 2020, 3:44 PM IST

Updated : Feb 29, 2020, 6:53 AM IST

15:19 February 05

శతకంతో రాణించిన రాస్​ టేలర్​

హామిల్టన్ వేదికగా భారత్​తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్​ ఘన విజయం సాధించింది. భారత్​ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యాన్ని 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ జట్టు బ్యాట్స్​మన్​ రాస్​ టేలర్​(108*) శతకంతో ఆకట్టుకోగా... హెన్రీ, టామ లేథమ్​ అర్ధ సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో కుల్దీప్​ 2 వికెట్లు.. షమి, శార్దూల్​ తలో వికెట్​ పడగొట్టారు.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 347 రన్స్​ చేసింది. శ్రేయస్ అయ్యర్ (103, 107 బంతుల్లో; 11 ఫోర్లు, 1 సిక్సర్​) శతకంతో ఆకట్టుకోగా.. కేఎల్‌ రాహుల్ (88*, 64 బంతుల్లో; 3 ఫోర్లు,6 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (51, 63 బంతుల్లో; 6 ఫోర్లు) అర్ధశతకాలు చేశారు. ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగ్రేటం చేసిన ఓపెనర్లు పృథ్వీషా (20), మయాంక్‌ అగర్వాల్‌ (32) భారీ స్కోరులు సాధించకపోయినా ఫర్వాలేదనిపించారు.

Last Updated : Feb 29, 2020, 6:53 AM IST

ABOUT THE AUTHOR

...view details