తెలంగాణ

telangana

రాజస్థాన్​ రాయల్స్ ఆటగాడే కోచ్​ అయ్యాడు

By

Published : Jan 2, 2020, 5:10 PM IST

గత రెండు సీజన్లలో రాజస్థాన్​ రాయల్స్​ ఆటగాడిగా ఉన్న ఇష్​ సోదీ... రానున్న ఏడాదిలో అదే జట్టుకు బౌలింగ్ సహాయక ​కోచ్​గా​, జట్టు వ్యవహారాల పర్యవేక్షకుడిగా కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన ప్రకటన చేసింది యాజమాన్యం.

Newzeland Bowler Ish Sodhi Returns to Rajasthan Royals as Spin Consultant for 2020
రాజస్థాన్​ జట్టులో ఆటగాడే కోచ్​ అయ్యాడు...

న్యూజిలాండ్​ లెగ్​స్పిన్నర్​ ఇష్​ సోదీ.. ఇకపై రాజస్థాన్​ రాయల్స్​ బౌలింగ్​ సహాయక కోచ్​గా సేవలందించనున్నాడు. గత రెండు సీజన్లలో ఇదే జట్టులో ఆటగాడిగా ఉన్న ఇతడు... ఈ ఏడాది బౌలింగ్ మెలకువలు చెప్పే బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ప్రధాన బౌలింగ్​ కోచ్​ సాయిరాజ్​ బహతులే, ప్రధాన ఆపరేషన్స్​ అధికారి జేక్​ లష్​ మెక్​కరమ్​కు సహాయకుడిగా పనిచేయనున్నాడు.

" ఇష్​ సోదీ.. కొత్త బాధ్యతతో జట్టులోకి రావడం ఆనందంగా ఉంది. యువ క్రికెటర్లకు మంచిగా తర్ఫీదు ఇవ్వగలిగే సత్తా అతడి సొంతం. ఈ వేసవిలో రాజస్థాన్​ రాయల్స్​కు అభిమానుల మద్దతు ఉంటుందని భావిస్తున్నాం"
--జుబిన్​ బరుచ, రాజస్థాన్​ రాయల్స్ డైరెక్టర్

రాజస్థాన్ రాయల్స్​ ఫ్రాంఛైజీ.. ఆటగాడి నుంచి స్పిన్ కన్స్​ల్టెంట్ (బౌలింగ్ సహాయక కోచ్​)గా పదవీ బాధ్యతలు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశాడు ఇష్​ సోదీ.

" ఇప్పటివరకు రెండు సీజన్లుగా జట్టులో ఆటగాడిగా ఉన్నా. అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇకపై జట్టును బౌలింగ్​ విభాగంలో మరింత మెరుగుపర్చేందుకు నా వంతు పాత్ర పోషిస్తాను. జట్టు కోసం పనిచేస్తావా? అని యాజమాన్యం అడగ్గా... ఒక్కమాట ఆలోచించలేదు. వెంటనే ఒప్పేసుకున్నా. ఎందుకంటే ఫ్రాంచైజీ అంటే అంత ఇష్టం. ఈ ఏడాది జట్టను గెలిపించేందుకు నావంతు ప్రయత్నం చేస్తాను"

-- ఇష్​ సోదీ, క్రికెటర్​

రెండు సీజన్లు రాజస్థాన్​ జట్టులో ఆడిన ఇతడు.. తొమ్మిది వికెట్లు తీశాడు. 27 ఏళ్ల ఈ క్రికెటర్..​ ఇప్పటివరకు 40 అంతర్జాతీయ టీ20లు ఆడి.. 47 వికెట్లు తీశాడు.

ప్రస్తుతం మయాంక్​ మార్కండే కీలక లెగ్​ స్పిన్నర్​గా ఉన్నాడు. ఇతడితో పాటు ఆల్​రౌండర్లు అనిరుధ్​ జోషి, యశస్వి జైస్వాల్​, మహిపాల్​ లోమ్రర్ స్పిన్​ బౌలింగ్​ వేయగలరు. వీరిని తర్ఫీదు ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించనున్నాడు ఇష్​ సోదీ.

ఇటీవల జరిగిన వేలంలో రూ.28.90 కోట్లతో వచ్చి... రూ.14.75 కోట్లు మిగుల్చుకుంది. మొత్తం 25 మందితో జట్టు సిద్ధం చేసుకుంది.

కొత్త ఆటగాళ్లు

రాబిన్‌ ఊతప్ప(3 కోట్లు), జయ్‌దేవ్‌ ఉనద్కత్‌(3 కోట్లు), యశస్వి జైశ్వాల్‌(2.40 కోట్లు), అనూజ్‌ రావత్‌(80 లక్షలు), కార్తిక్‌ త్యాగి(1.30 కోట్లు), ఆకాశ్‌ సింగ్‌(20 లక్షలు), డేవిడ్‌ మిల్లర్‌(75 లక్షలు), ఒషానో థామస్‌(50 లక్షలు), అనిరుధ్‌ జోషి(20 లక్షలు), ఆండ్రూ టై(1 కోటి), టామ్‌ కరన్‌(1 కోటి).

అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు

స్టీవ్‌స్మిత్‌ (కెప్టెన్‌), సంజు శాంసన్‌, జోఫ్రా ఆర్చర్‌, బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, రియాన్‌ పరాగ్‌, శశాంక్‌ సింగ్‌, శ్రేయస్‌ గోపాల్‌, మహిపాల్‌ లోమ్రర్‌, వరుణ్‌ ఆరోన్‌, మనన్‌ వోహ్రా, మయాంక్‌ మర్కండే (బదిలీపై), రాహుల్‌ తెవాతియా (బదిలీపై), అంకిత్‌ రాజ్‌పుత్‌ (బదిలీపై).

ABOUT THE AUTHOR

...view details