న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో మూడు వికెట్లతో సత్తాచాటాడు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అలాగే ఓ రికార్డునూ కైవసం చేసుకున్నాడు.
టీ20 క్రికెట్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు బుమ్రా. ప్రస్తుతం ఇతడి ఖాతాలో ఏడు మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. ఆరు మెయిడిన్లతో శ్రీలంకకు చెందిన నువాన్ కులశేఖర రెండో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా నాలుగు ఓవర్లు వేసి 12 పరుగులిచ్చి మూడు వికెట్లు దక్కించుకున్నాడు.