న్యూజిలాండ్ మాజీ కెప్టెన్‌గా వెటోరీ అందించిన సేవలకు సరైన గౌరవం కల్పించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. అతడు ధరించిన 11 సంఖ్య జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించింది. వెటోరీతో పాటు కివీస్ తరఫున 200 వన్డేలు ఆడిన ప్రతి ఆటగాడి జెర్సీ నెంబర్‌కు వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకుంది.
'200కు పైగా వన్డేల్లో న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లందరి జెర్సీలను రిటైర్ చేశాం' అంటూ కివీస్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది.