బోర్డర్-గావస్కర్ ట్రోఫీ గెలుపొంది స్వదేశానికి తిరిగొచ్చిన టీమ్ఇండియా క్రికెటర్లకు ఘనస్వాగతం లభిస్తోంది. యార్కర్ స్పెషలిస్టు నటరాజన్‌కు కూడా తమిళనాడులో అదిరిపోయే రేంజ్లో స్వాగతం పలికారు అభిమానులు. సేలంలో డోలు, సన్నాయిలతో నట్టును రథంపై ఊరేంగింపుగా తీసుకెళ్లారు.
డోలు బాజాలతో నట్టుకు ఘన స్వాగతం - నటరాజన్‌కు ఘనస్వాగతం
స్వదేశానికి తిరిగొచ్చిన టీమ్ఇండియా పేసర్ నటరాజన్‌కు తమిళనాడులో ఘనస్వాగతం లభించింది. రథంపై ఎక్కించి ఊరేగింపుగా తీసుకెళ్లారు అభిమానులు.
డోలు బాజాలతో నట్టుకు ఘన స్వాగతం
ఆస్ట్రేలియా పర్యటనకు నెట్ బౌలర్‌గా వెళ్లిన నట్టు.. అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసి తిరిగొచ్చాడు. మూడో వన్డేలో రెండు వికెట్లు, టీ20 సిరీస్‌లో అత్యధికంగా 6 వికెట్లు సాధించాడు. గబ్బాలో ఆఖరి టెస్టులోనే అరంగేట్రం చేసిన తమిళనాడు పేసర్.. తొలి ఇన్నింగ్స్‌లో 3వికెట్లు తీసి భారత్ గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు.
ఇదీ చూడండి:శంషాబాద్‌లో సిరాజ్, విహారిలకు ఘనస్వాగతం