లక్ష్యాన్ని ఛేదించాలన్నా, ఒత్తిడిలో ఉన్నప్పుడు బ్యాటింగ్ చేయాలన్నా అతడికే సాధ్యం. నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్నాడు టీమిండియా కెప్టెన్ కోహ్లి. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమైన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి ముందు 251 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది మెన్ ఇన్ బ్లూ.
ఒక్కడై నిలిచిన కోహ్లి..
ఈ మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవకముందే రోహిత్ డకౌట్‌గా వెనుదిరిగాడు. 21 పరుగులు చేసిన తర్వాత ధావన్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి 48 ఓవరు వరకు నిలిచి 116 పరుగులు సాధించాడు. భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. కెరీర్లో 40వ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
విజయ్ ఉండుంటే..
ఉన్నంత సేపు ధాటిగా ఆడిన విజయ్ శంకర్ 46 పరుగులు చేసి జట్టుకు విలువైన భాగస్వామ్యం అందించాడు. జంపా బౌలింగ్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. మిగతా వారిలో రాయుడు 18, జాదవ్ 11 రన్స్ చేశారు. ధోని డకౌట్ అయ్యాడు.