అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీ వివిధ రంగాల్లో అడుగు పెడుతున్నాడు. ఇప్పటికే క్రీడా వ్యాపారంలోకి దిగాడు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు 'కెప్టెన్ 7' పేరుతో యానిమేటెడ్ సిరీస్‌ను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ధోనీకి ఏడో నంబర్ జెర్సీ అంటే ఇష్టం. అందుకే యానిమేటెడ్ సిరీస్‌కు 'కెప్టెన్ 7' అని పేరు పెట్టారు. సిరీసులో తొలి సీజన్ పూర్తిగా గూఢచర్యం నేపథ్యంలో ఉంటుందని, ధోనీ ఆధారంగా కథ తెరకెక్కుతోందని తెలిసింది. 'కథ, కథనం గొప్పగా ఉన్నాయి. క్రికెట్‌తో పాటు నా ఇతర అభిరుచులను ఇది ప్రతిబింబిస్తుంది' అని ధోనీ తెలిపాడు.