తెలంగాణ

telangana

ETV Bharat / sports

జాతీయ గీతం ఆలపిస్తూ సిరాజ్‌ కంటతడి

ఆస్ట్రేలియాతో మూడో టెస్టు సందర్భంగా ఓ ఉద్విగ్న సంఘటన జరిగింది. భారత జాతీయ గీతం ప్రారంభం కాగానే ఉద్వేగానికి లోనయ్యాడు పేసర్ మహ్మద్ సిరాజ్.

Mohammed Siraj breaks down in tears as SCG roars with India's national anthem at start of third Test
జాతీయ గీతం ఆలపిస్తూ సిరాజ్‌ కంటతడి..

By

Published : Jan 7, 2021, 10:43 AM IST

టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కంటతడి పెట్టాడు. ఇటీవలే తండ్రిని కోల్పోయిన అతడు ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు ప్రారంభం సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యాడు. సీనియర్ పేసర్‌ మహ్మద్‌ షమి తొలి టెస్టులో గాయపడగా రెండో టెస్టుకు ఎంపికయ్యాడు సిరాజ్‌. తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానె ఆ మ్యాచ్‌కు ముందు టెస్టు క్యాప్‌ అందజేసి అరంగేట్రం చేయించాడు. ఈ క్రమంలోనే ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన సిరాజ్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే మూడో టెస్టులోనూ అవకాశం రావడం వల్ల గురువారం మ్యాచ్‌ ప్రారంభమైన సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యాడు.

సిడ్నీలో మ్యాచ్‌ ఆరంభానికి ముందు జాతీయ గీతం ఆలపించిన సమయంలో ఈ హైదరాబాద్‌ పేసర్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయాడు. రెండు చేతులతో ఆ కన్నీటిని తుడుచుకుంటూ కనిపించాడు. అదంతా మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారంలో కనిపించింది. దీంతో అభిమానులూ ఉద్విగ్నానికి లోనయ్యారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్​గా మారింది.

అనంతరం మ్యాచ్‌ ఆరంభమైన కొద్దిసేపటికే సిరాజ్‌ భారత్‌కు శుభారంభం అందించాడు. ఆస్ట్రేలియా ఓపెనర్‌, ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌(5)ను ఔట్‌ చేశాడు. నాలుగో ఓవర్‌లో ఓ చక్కటి బంతిని వేసి బోల్తా కొట్టించాడు.

ఇదీ చూడండి:నాన్న కల నెరవేర్చిన వేళ.. సిరాజ్​ అదరహో!

ABOUT THE AUTHOR

...view details