చెన్నై వేదికగా జరుగనున్న తొలి టెస్టు ద్వారా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్.. కొత్త రికార్డును అందుకోనున్నాడు. భారత్‌తో జరిగే ఈ మ్యాచ్ అతనికి 100వ టెస్టు. తద్వార రూట్.. ఈ రికార్డు సాధించిన 15వ ఇంగ్లీష్ ఆటగాడిగా నిలవనున్నాడు.
సమకాలీన క్రికెట్ ప్రపంచంలో బిగ్-4గా పిలుస్తున్న ఆటగాళ్లలో రూట్ ఒకడు. విరాట్ కోహ్లీ(87), స్టీవ్ స్మిత్(77), కేన్ విలియమ్స్(83)ల కంటే ముందు ఈ ఫీట్‌ను అందుకున్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నాడు రూట్. మిగతా ముగ్గురి సగటు(50) కంటే తక్కువతో తొలుత 8వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్ కూడా అతడే కావడం గమనార్హం.
ఫిబ్రవరి 5 నుంచి జరుగనున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఈ ఇంగ్లాండ్ కెప్టెన్ కీలకం కానున్నాడు. శ్రీలంక పర్యటనలో స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించిన రూట్.. ఓ ద్విశతకం, శతకం సాయంతో మొత్తం 426 పరుగులు రాబట్టాడు.