తెలంగాణ

telangana

ETV Bharat / sports

వారిద్దరే టాప్ బౌలర్లు కాదు: రబాడ - bumrah

టీమిండియా స్టార్​ పేసర్​ బుమ్రా, ఇంగ్లాండ్ బౌలర్​ ఆర్చర్​పై విమర్శలు చేశాడు దక్షిణాఫ్రికా బౌలర్​ కగిసో రబాడ. వారిద్దరే ఎప్పుడూ టాప్ బౌలర్లుగా ఉండరని మండిపడ్డాడు.

రబాడ

By

Published : Sep 8, 2019, 10:04 PM IST

Updated : Sep 29, 2019, 10:28 PM IST

కొంతమంది క్రికెటర్లను మాత్రమే మీడియా హైప్‌ చేస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశాడు సఫారీ పేసర్‌ రబాడ . టీమిండియా స్టార్​ బౌలర్​ బుమ్రా, ఇంగ్లాండ్ యువ బౌలర్ ఆర్చర్​పై పరోక్షంగా విమర్శలు చేశాడు. ఇటీవల కాలంలో వీరిద్దరినీ మీడియా ఆకాశానికి ఎత్తేస్తుందని... కొంతమందిపై నిర్లక్ష్యపు ధోరణి ప్రదర్శిస్తుందని మండిపడ్డాడు రబాడ.

ఆర్చర్‌, బుమ్రాలు గొప్పగా బౌలింగ్ చేస్తున్నారు. వారు తమ ప్రదర్శనతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆర్చర్ సహజంగానే ప్రతిభగల పేసర్. బుమ్రా బంతితో అద్భుతాలు చేస్తున్నాడు. అయితే కేవలం ఆ ఇద్దరు మాత్రమే అత్యుత్తమ ఆటతీరు కనబరచడం లేదు. నేనూ గొప్పగానే బౌలింగ్ చేస్తున్నా. ఎప్పుడూ ఆ ఇద్దరే టాప్‌లో ఉండరనే విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను"
-కగిసో రబాడ, దక్షిణాఫ్రికా బౌలర్

వెస్టిండీస్​తో జరిగిన రెండు టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేసిన బుమ్రా... హ్యాట్రిక్​తో పాటు మొత్తం 13 వికెట్లతో సత్తాచాటాడు. ఫలితంగా టెస్టు ర్యాంకింగ్స్​లో ముూడో స్థానానికి చేరాడు. ప్రస్తుతం జరుగుతోన్న యాషెస్​ రెండు టెస్టుల్లో 13 వికెట్లతో అదరగొట్టాడు ఆర్చర్.

భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు టీ20, మూడు టెస్టులు జరగనున్నాయి. మొదటి టీ20 సెప్టెంబర్ 15న ప్రారంభం కానుంది.

Last Updated : Sep 29, 2019, 10:28 PM IST

ABOUT THE AUTHOR

...view details