ఫేక్ ఫీల్డింగ్.. ఒకప్పుడు ఈ మాట క్రికెట్ ప్రియులకు కొత్త.. ప్రస్తుతం చాలామందికి దీని గురించి తెలుసు. రెండేళ్ల క్రితం క్రికెట్ నిబంధనలు కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ. బంతి చేతిలో లేకుండానే ఉన్నట్టు నటించడం, వికెట్ల వైపు విసరడం లాంటివి ఫేక్ ఫీల్డింగ్ కిందకి వస్తాయి. ఇలాంటి ఘటనకు పాల్పడితే శిక్షగా ప్రత్యర్థి జట్టుకి ఐదు పరుగులు అదనంగా ఇస్తారు. తాజాగా నాగపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఇదే జరిగింది. కాకపోతే అంపైర్లు ఈ విషయాన్ని గమనించలేదు.
మ్యాక్స్‌వెల్ ఫేక్ ఫీల్డింగ్... - fake fielding
నాగపూర్‌లో ఆసిస్‌తో జరిగిన రెండో వన్డేలో మ్యాక్స్‌వెల్ ఫేక్ ఫీల్డింగ్‌కు పాల్పడ్డాడు. అంపైర్లు గమనించక విషయం బయటకి రాలేదు. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ అవుతోంది.
కౌల్టర్‌నైల్ వేసిన ఓవర్లో జడేజా ఆఫ్ సైడ్.. కట్ షాట్ కొట్టగా. మ్యాక్స్‌వెల్ బంతిని అందుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. అయినప్పటికీ వికెట్ కీపర్‌కు బంతిని విసిరినట్టు చేసి ఫేక్ ఫీల్డింగ్‌కు పాల్పడ్డాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైనట్లైతే ఈ విషయమై పెద్ద చర్చే జరుగుతుండేది. ఒకవేళ అంపైర్లు గమనించి ఉన్నట్లయితే భారత్‌కు మరో ఐదు పరుగులు బోనస్‌గా కలిసేవి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.