తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత అమ్మాయితో.. మ్యాక్స్​వెల్​ ప్రేమాయణం!

ఆసీస్​ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్​వెల్​ భారత్​కు చెందిన యువతితో ప్రేమలో పడినట్టు సమాచారం. ఆస్ట్రేలియాలో స్థిరపడిన విని రామన్​తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు మ్యాక్సీ.

By

Published : Aug 28, 2019, 9:14 PM IST

Updated : Sep 28, 2019, 4:01 PM IST

మ్యాక్స్​వెల్

ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ తన సిక్సర్లతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంటాడు. ఇప్పుడో అమ్మాయి మనసు దోచుకున్నాడని, ఆమెతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని సమాచారం. భారత సంతతికి చెందిన విని రామన్​తో కలిసి పార్టీల్లో మునిగితేలుతున్నాడు ఈ ఆసీస్​ ఆటగాడు. వీరిద్దరూ ఆస్ట్రేలియా వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారు.

అయితే వీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ మ్యాక్స్​వెల్​, విని రామన్ ఒక్కటైతే భారత అమ్మాయిని పెళ్లాడిన రెండో ఆసీస్ క్రికెటర్​గా మ్యాక్సీ నిలవనున్నాడు. ఇంతకు ముందు షాన్​ టైట్ భారత యువతినే పెళ్లాడాడు. 2014 ఐపీఎల్ సమయంలో మాషుమ్ సింఘాను కలిసిన టైట్ అనంతరం ఆమెను వివాహం చేసుకున్నాడు.

ఐపీఎల్ ద్వారా మ్యాక్స్​వెల్​కు భారత్​లోనూ అభిమానులున్నారు. ఇటీవల జరిగిన ప్రపంచకప్​లో పెద్దగా రాణించని మ్యాక్సీ ప్రస్తుతం ఇంగ్లాండ్​లో జరుగుతున్న టీ 20 బ్లాస్ట్​లో సత్తాచాటుతున్నాడు. లాంక్​షైర్ తరపున విజృంభిస్తున్నాడు.

ఇది చదవండి: 'జాతీయ గీతం పాడుతుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి'

Last Updated : Sep 28, 2019, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details