తెలంగాణ

telangana

ETV Bharat / sports

బిగ్​బాష్​ లీగ్​లో రికార్డుల మోత.. ఒకేసారి రెండు - బీబీఎల్​లో స్టోయినిస్ అత్యధిక స్కోర్

ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్ మార్కస్ స్టోయినిస్.. బిగ్​బాష్ లీగ్​లో​ రికార్డు శతకం చేశాడు. 147 పరుగులతో సత్తాచాటాడు. ఈ మ్యాచ్​లో మెల్​బోర్న్ జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.

marcus
స్టోయినిస్

By

Published : Jan 12, 2020, 5:11 PM IST

బిగ్​బాష్​ లీగ్​లో మెల్​బోర్న్ స్టార్స్​కు ఆడుతున్న మార్కస్ స్టోయినిస్..​ రికార్డు శతకంతో మెరిశాడు. సిడ్నీ సిక్సర్స్​తో మ్యాచ్​లో 79 బంతుల్లో 147 పరుగుల చేసి సత్తాచాటాడు. ఇందులో 13 ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. ఈ లీగ్​లో ఇదే వ్యక్తిగత అత్యధిక స్కోరు. ఇంతకుముందు షార్ట్​ చేసిన 122 పరుగులే అత్యధికం. స్టోయినిస్​కు టీ20ల్లో ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం.

స్టోయినిస్

స్టోయినిస్-హిల్టన్ కార్ట్​రైట్ మధ్య ఓపెనింగ్ భాగస్వామ్యం 207 పరుగులు. బీబీఎల్​లో ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. మెల్​బోర్న్ స్టార్స్ ఓపెనర్లు లూక్ రైట్-రాబ్ క్వినే చేసిన 172 పరుగులే ఇప్పటివరకు అత్యధికం.

స్టోయినిస్ చేసిన 147 పరుగులు ఆస్ట్రేలియా తరఫున మూడో అత్యధికం. ఆరోన్ ఫించ్ చేసిన 172, 156 పరుగులు మొదటి స్థానాల్లో ఉన్నాయి.

స్టోయినిస్ శతకంతో మెల్​బోర్న్ స్టార్స్..​ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 219 పరుగులు చేసింది. బీబీఎల్ చరిత్రలో ఇది మూడో అత్యధికం. మెల్​బోర్న్ స్టార్స్​కు ఇదే ఉత్తమం. హోబర్ట్ హరికేన్స్ చేసిన 223 పరుగులు మొదటి స్థానంలో ఉంది.

ఈ మ్యాచ్​లోని తన వ్యక్తిగత స్కోరులో స్టోయినిస్..​ బౌండరీల ద్వారా సాధించినవే 100 పరుగులు ఉన్నాయి. ఈ విధంగా అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గానూ నిలిచాడు. ఈ జాబితాలో ల్యూక్ రైట్, బెన్ మెక్​డర్మొట్ చేసిన 86 పరుగులు ఇప్పటివరకు అత్యధికం.

ప్రస్తుతం బీబీఎల్ సీజన్​లో అత్యధిక పరుగులు (378) చేసిన క్రికెటర్​గా కొనసాగుతున్నాడు స్టోయినిస్. రానున్న ఐపీఎల్​ సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్​కు ఆడనున్నాడీ ఆసీస్ క్రికెటర్.

ఇవీ చూడండి.. ఆ ఓపెనర్లిద్దరి​ మధ్య పోటీ ఆసక్తికరం: జోన్స్

ABOUT THE AUTHOR

...view details