వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీసీసీఐ వ్యాఖ్యాతల ప్యానల్లో చోటు కోల్పోయిన భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.. చాన్నాళ్ల తర్వాత మళ్లీ టీవీ కామెంటరీ బాక్స్‌లో కనిపించనున్నాడు. ఈ నెలలో ఆరంభమయ్యే భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌కు తాను వ్యాఖ్యానం చేయబోతున్నట్లు సంజయ్ తెలిపాడు.
మళ్లీ కామెంటరీ బాక్స్‌లో మంజ్రేకర్! - బీసీసీఐ వ్యాఖ్యాతల ప్యానల్ సంజయ్ మంజ్రేకర్.
వివాదాస్పద వ్యాఖ్యలతో బీసీసీఐ కామెంటరీ బాక్స్‌లో చోటు కోల్పోయిన సంజయ్ మంజ్రేకర్.. మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌కు వ్యాఖ్యానం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
మళ్లీ కామెంటరీ బాక్స్‌లో మంజ్రేకర్!
2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను 'బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్'గా అభివర్ణించి మంజ్రేకర్ సర్వత్రా విమర్శల పాలయ్యాడు. ఆ తర్వాత అతను కామెంటరీ బాక్స్‌లో కనిపించలేదు.