టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ కె.ఎల్.రాహుల్ దూకుడు ప్రదర్శించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు పొట్టి మ్యాచ్‌ల్లోనూ 47, 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగు పరుచుకుని ఐదో ర్యాంకుకు చేరాడు.
ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌ల్లోనూ ఆడని కుల్దీప్ యాదవ్ ఐదో స్థానానికి పడిపోయాడు.
బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో ఉన్నాడు. బౌలర్లలో అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
టీం విభాగంలో 135 పాయింట్లతో పాక్ తొలి స్థానంలో ఉంది. 122 పాయింట్లతో భారత్ జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది. 121 పాయింట్లతో ఇంగ్లండ్ మూడో స్థానానికి పరిమితమైంది.
ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్...తన కెరీర్లో 700 పాయింట్లు సాధించి అత్యుత్తమంగా మూడో స్థానానికి ఎగబాకాడు.