బంగ్లాదేశ్ క్రికెటర్ లిట్టన్ దాస్ భార్య సంచితాకు, గ్యాస్ సిలిండర్ పేలి తీవ్ర గాయలయ్యాయి. ఈ సంఘటన గత శుక్రవారం చోటు చేసుకుంది. ఆమె వంటగదిలో టీ చేస్తుండగా, సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ముఖాన్ని కాపాడుకునే క్రమంలో చేతులు అడ్డుపెట్టుకోవడం వల్ల వాటికి తీవ్రగాయాలయ్యాయి. అయితే సిలిండర్‌కు రంధ్రం ఉండటం వల్లే ఇలా జరిగిందని లిట్టన్ కుటుంబసభ్యులు చెప్పారు. అనంతరం గాయాల నుంచి కొద్దిగా కోలుకున్న సంచితా.. ఈ షాకింగ్ ఘటన గురించి మాట్లాడింది.
సిలిండర్ పేలి క్రికెటర్ భార్యకు తీవ్రగాయాలు - gas cylinder blast
సిలిండర్ పేలిన ఘటనలో బంగ్లా క్రికెటర్ లిట్టన్ దాస్ భార్య సంచితాకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం ఈ విషయం గురించి మాట్లాడిన ఈమె.. ఆ సమయంలో చావుకు దగ్గరగా వెళ్లొచ్చినట్లు అనిపించిదని చెప్పింది.
భార్యతో క్రికెటర్ లిట్టన్ దాస్
"నాకు చెప్పేందుకు మాటలు రావడం లేదు. ఆరోజు చావుకు దగ్గరగా వెళ్లొచ్చినట్లు అనిపించింది. చేతులు అడ్డుపెట్టుకోకపోతే మొత్తం ముఖం కాలిపోయుండేది. నిప్పు అంటుకోవడం వల్ల జుత్తును కత్తిరించాలని వైద్యులు చెప్పారు" -సంచితా, లిట్టన్ దాస్ భార్య
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత లిట్టన్-సంచితాలకు వివాహం జరిగింది. బంగ్లాదేశ్‌లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తన సగం జీతాన్ని విరాళంగా ఇచ్చాడీ క్రికెటర్. ఇతడితో పాటే మరో 25 మంది క్రికెటర్లు ఈ మంచిపని కోసం ముందుకొచ్చారు.