ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టుకుఆ్రస్టేలియా మాజీ క్రికెటర్ లీసా కెయిట్లీను ప్రధాన కోచ్‌గా నియమించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ). ఇంగ్లీష్ జట్టుకు ఓ మహిళా క్రికెటర్.. హెడ్ కోచ్‌గా ఉండటం ఇదే తొలిసారి. లీసా.. 9 టెస్టుల్లో, 48 వన్డేల్లో ఆసీస్ తరఫున ఆడింది.
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు మహిళా కోచ్
ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టుకు తొలిసారిగా లీసా కెయిట్లీ అనే మహిళను ప్రధాన కోచ్‌గా నియమించింది ఈసీబీ.
లీసా
ఇంతకుముందు మార్క్ రాబిన్సన్.. ఇంగ్లాండ్ మహిళల జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. అతడి ఆధ్వర్యంలోనే 2017లో ప్రపంచకప్ గెలిచింది. యాషెస్ సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టు ఓటమి తర్వాత తన పదవికి రాజీనామా చేశాడు రాబిన్సన్. ఫలితంగా ఈసీబీ.. 48 ఏళ్ల లీసాను ప్రధాన కోచ్‌గా నియమించింది. వచ్చే జనవరిలో ఈమె తన బాధ్యతలు స్వీకరిస్తుంది.
ఇవీ చూడండి.. క్రికెటర్ మ్యాక్స్వెల్ సంచలన నిర్ణయం