తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఫిరోజ్​ షా కోట్లా' స్టేడియం పేరు మారిందిలా...! - ఫిరోజ్​ షా కోట్లా

దిల్లీలోని 'ఫిరోజ్​ షా కోట్లా' మైదానంలోని స్టేడియం పేరును త్వరలో మార్చనున్నారు. ఈ విషయాన్ని దిల్లీ క్రికెట్​ సంఘం(డీడీసీఏ) ప్రకటించింది. ఈ స్టేడియానికి మాజీ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేరు పెట్టనున్నట్లు వెల్లడించింది.

'ఫిరోజ్​ షా కోట్లా' పేరు మారిందిలా...!

By

Published : Aug 27, 2019, 4:17 PM IST

Updated : Sep 28, 2019, 11:40 AM IST

దిల్లీ 'ఫిరోజ్​ షా కోట్లా' మైదానంలోని స్టేడియాన్ని అరుణ్​ జైట్లీ పేరుతో పిలవనున్నారు. దిల్లీ క్రికెట్​ సంఘం(డీడీసీఏ) మంగళవారం ఈ నిర్ణయం ప్రకటించింది. మాజీ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ ​జైట్లీ గతంలో ఇదే సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు.

మైదానంలో క్రికెట్​ ఆడుతున్న జైట్లీ

"విరాట్​ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్​, గౌతమ్​ గంభీర్​, ఆశిష్​ నెహ్రా, రిషభ్​ పంత్​ వంటి ఎందరో ఆటగాళ్లు భారత జట్టులోకి రావడానికి జైట్లీ ఎంతగానో కృషి చేశారు. ఆయన డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే స్టేడియం ఆధునికీకరణ, వీక్షకుల గ్యాలరీలో సీట్ల సంఖ్య పెంపు నిర్ణయం, ప్రపంచస్థాయి డ్రెస్సింగ్​ రూమ్​ల నిర్మాణం జరిగాయి. జైట్లీ సేవలకు గుర్తుగా స్టేడియానికి ఆయన పేరును పెడుతున్నాం".

-- రజత్​ శర్మ, దిల్లీ క్రికెట్​ సంఘం అధ్యక్షుడు

స్డేడియాన్ని( వీక్షకుల గ్యాలరీ, పెవిలియన్​ ) మాత్రమే అరుణ్​ జైట్లీ పేరుతో పిలవనున్నారు. గ్రౌండ్​ను మాత్రం పాత పేరుతోనే పిలవనున్నట్లు రజత్​ స్పష్టం చేశారు. ఈ తాజా ప్రతిపాదనను ప్రస్తుత హోంశాఖ మంత్రి అమిత్​ షా, క్రీడా శాఖ మంత్రి కిరణ్​ రిజిజు స్వాగతించినట్లు ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి...ప్రతిష్ఠాత్మక కోట్లా మైదానంలో విరాట్​ కోహ్లీ స్టాండ్​

Last Updated : Sep 28, 2019, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details