తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టుల్లో కోహ్లీ అగ్రస్థానం పదిలం - rankings

తాజా టెస్టు ర్యాంకింగ్స్​లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని పదిల పరచుకున్నాడు. విలియమ్సన్ రెండో ర్యాంకులో ఉన్నాడు. జట్లు వారిగా చూస్తే టీమిండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది.

టీమిండియా

By

Published : Jul 23, 2019, 8:45 PM IST

ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్​ను నేడు ప్రకటించింది. ఉత్తమ టెస్టు బ్యాట్స్​మెన్​ జాబితాలో విరాట్​ కోహ్లీ అగ్రస్థానాన్ని పదిల పరచుకున్నాడు. జట్లు వారిగా చూస్తే టీమిండియా మొదటి ర్యాంకులో ఉంది. బౌలర్లలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ టాప్ - 10లో చోటు దక్కించుకున్నారు.

టెస్టు బ్యాట్స్​మెన్​ల్లో కోహ్లీ 922 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కేన్ విలియమ్స్ 913 పాయింట్లతో రెండో ర్యాంకులో ఉండగా.. 881 పాయింట్లతో పుజారా స్థానంలో ఉన్నాడు.

జట్లు వారిగా చూస్తే భారత్ మొదటి ర్యాంకులో కొనసాగుతోంది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచకప్​ విజేత ఇంగ్లాండ్ నాలుగో ర్యాంకులో ఉండగా.. ఆస్ట్రేలియా 5వ స్థానానికి దిగజారింది.

బౌలింగ్ విభాగంలో టాప్​ -10లో ఇద్దరు భారత బౌలర్లు చోటుదక్కించుకున్నారు. జడేజా 6వ ర్యాంకులో ఉండగా.. అశ్విన్ ద10వ స్థానాన్ని క్కించుకున్నాడు. ఆల్​రౌండర్ విభాగంలోనూ జడేజా 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. జడ్డూ కంటే ముందు జేసన్ హోల్డర్, షకిబుల్​ ఉన్నారు.

ఇది చదవండి: టెస్ట్​ క్రికెటర్లను గుర్తు పట్టడం మరింత సులువు

ABOUT THE AUTHOR

...view details