కొత్త కోచ్ కోసం ఓ పక్క దరఖాస్తులు స్వీకరిస్తోంది బీసీసీఐ. అయితే కోచ్గా రవిభాయ్ కొనసాగితేనే బాగుంటుందని తన మనసులో మాట వ్యక్తపరిచాడు విరాట్ కోహ్లీ. ప్రపంచకప్ సెమీఫైనల్లో టీమిండియా వైదొలిగిన తర్వాత రవిశాస్త్రిపై విమర్శలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో విరాట్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
"కోచ్, తదితర సిబ్బంది ఎంపిక గురించి బీసీసీఐ సలహా సంఘం(సీఏసీ) నాతో మాట్లడలేదు. కానీ రవిభాయ్ కోచ్గా ఉంటే బాగుంటుందని అని నాకు అనిపిస్తోంది. అయితే సీఏసీయే తుదినిర్ణయం తీసుకుంటుంది. -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్