తెలంగాణ

telangana

ETV Bharat / sports

విరాట్ కోహ్లీకి 'పెటా' అరుదైన గౌరవం - PETA

జంతువుల సంరక్షణ కోసం చేసిన కృషికిగాను విరాట్ కోహ్లీని 'పర్సన్ ఆఫ్ ద ఇయర్-2019' పురస్కారంతో గౌరవించింది పెటా సంస్థ.

కోహ్లీ

By

Published : Nov 20, 2019, 5:18 PM IST

టీమిండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది మేటి వ్యక్తిగా(పర్సన్ ఆఫ్ ద ఇయర్-2019) విరాట్​ను ఎంపిక చేసింది జంతు హక్కుల సంరక్షణ సంస్థ పెటా. మూగజీవుల రక్షణకు కోహ్లీ చేసిన కృషికి గాను ఈ అవార్డు దక్కినట్లు పెటా భారతీయ డైరెక్టర్ సచిన్ బంగేరా తెలిపారు.

"విరాట్ జంతువుల పట్ల ఎంతో దయగా ఉంటాడు. మూగజీవాల హింసను అతడు అస్సలు ఉపేక్షించడు. జంతువుల సంరక్షణ కోసం పాటు పడే వారెవ్వరినైనా పెటా ఇండియా గౌరవిస్తుంది." - సచిన్ బంగేరా, పెటా ఇండియా డైరెక్టర్

శాకాహారిగా మారిన విరాట్ కోహ్లీ జంతువుల సంరక్షణ కోసం తన వంతు సాయం చేస్తున్నాడు. ఇటీవల అమేర్ ఫోర్ట్​లో మాలతి అనే ఏనుగును హింసించిన 8 మందిపై చర్యలు తీసుకునేలా, వారి బారి నుంచి ఏనుగును కాపాడేందుకు పెటా తరఫున అధికారులకు లేఖ రాశాడు.

గతంలో ఈ అవార్డు కాంగ్రెస్ నేత శశి థరూర్, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కేఎస్ రాధాకృష్ణన్, నటి అనుష్క శర్మ, హేమ మాలిని, ఆర్.మాధవన్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ తదితరులకు లభించింది.

ఇవీ చూడండి.. రిటైర్మెంట్​పై లంక బౌలర్ మలింగ యూటర్న్

ABOUT THE AUTHOR

...view details