వెస్టిండీస్‌తో క్వీన్స్‌పార్క్‌లో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతలు సాధించాడు. ఒకే జట్టుపై... అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా, అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 2000 పరుగుల్ని పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
కోహ్లీ.. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెస్టిండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు పాకిస్థాన్‌కు చెందిన జావేద్ మియాందాద్(1930 పరుగులు) పేరిట ఉంది. దానిని విరాట్ అధిగమించాడు.