తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ ఒక్కడు కాదు.. జట్టు మొత్తంతో సమానం' - Kohli ek nahin, gyarah hai

కెప్టెన్ కోహ్లీ, జట్టులోని 11మందితో సమానమని చెప్పిన దిగ్గజ బౌలర్ సక్లెయిన్​ ముస్తాక్​... అతడిని ఔట్​ చేసేందుకు ఇంగ్లాండ్ బౌలర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసేవారని తెలిపాడు.

mustak
ముస్తాక్​, కోహ్లీ

By

Published : Jun 13, 2020, 9:20 AM IST

టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ అంటే ఒక్కడు కాదని జట్టులోని 11 మంది ఆటగాళ్లతో సమానమని చెప్పాడు పాక్​‌ దిగ్గజ బౌలర్ సక్లెయిన్‌ ముస్తాక్. ఇదే విషయాన్ని ఇంగ్లాండ్‌ స్పిన్నర్లు మొయిన్‌ అలీ, రషీద్‌లకు చెప్పి, విరాట్​ను ఔట్​ చేసే విషయంలో వారిని బాగా ప్రోత్సాహించినట్లు‌ తెలిపాడు. గతేడాది ప్రపంచకప్‌ వరకు ఇంగ్లాండ్‌ జట్టుకు స్పిన్‌ సలహాదారుడుగా ముస్తాక్ బాధ్యతలు నిర్వర్తించాడు. తన సూచనలు పాటించిన అలీ, రషీద్‌.. చెరో ఆరుసార్లు కోహ్లీని ఔట్‌ చేశారని వెల్లడించాడు.

"అతనొక్కడు కాదు. పదకొండు మందితో సమానం. కోహ్లీ వికెట్‌ దక్కించుకోవాలంటే జట్టు మొత్తానికి బౌలింగ్‌ వేసినంత. అతడ్ని అలాగే చూడాలి. ఓ బౌలర్‌గా స్పష్టమైన మానసిక దృక్పథం కలిగి ఉండాలి. నీ ఎదురుగా ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆటగాడు ఉండొచ్చు. ఏ స్పిన్నర్‌నైనా అతడు అలవోకగా ఎదుర్కోవచ్చు. అలాంటి సమయంలో ఒత్తిడి అనేది బౌలర్‌ మీద ఉండదు అని నేను వాళ్లకు చెప్పా. ఎందుకంటే ప్రపంచం మొత్తం బ్యాట్స్‌మన్‌నే చూస్తుంది"

- సక్లెయిన్ ముస్తాక్‌, పాక్​ క్రికెటర్​

2018లో భారత్​తో వన్డేలో స్పిన్నర్‌ రషీద్‌ లెగ్‌సైడ్‌ వేసిన బంతి, వేగంగా తిరిగి కోహ్లీ ఆఫ్‌స్టంప్‌ను ఎగరగొట్టింది. ఆ బంతికి 'విరాట్‌ వాలా డెలివరీ' అని పేరు పెట్టాడు ముస్తాక్​. ఆ తర్వాత రషీద్​ను‌ అలాంటి బంతి వేసేలా సాధన చేయడానికి ప్రోత్సాహించినట్లు తెలిపాడు​. కోహ్లీని వారు(రషీద్, అలీ) మానసికంగా దెబ్బతీసి ఔట్​ చేయడం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకునేవారని వెల్లడించాడు.

కుడి వైపు ముస్తాక్​

ఇది చూడండి :క్రికెట్లో ఏమిటి ఈ ఉమ్ము కథ?

ABOUT THE AUTHOR

...view details