తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మొదట్లో బౌండరీలు కొడితే తర్వాత పని సులభం'

భారత్​ తరఫున టీ20ల్లో రాణిస్తున్న రాహుల్.. విండీస్​పై విజయం అనంతరం మాట్లాడాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ గురించి ఆలోచించట్లేదని అన్నాడు. అదే విధంగా ఈ ఫార్మాట్​లో తొలుత బౌండరీలు కొడితే తర్వాత పని సులభమవుతుందని చెప్పాడు.​

'మొదట్లో బౌండరీలు కొడితే తర్వాత పని సులభం'
భారత బ్యాట్స్​మన్ కేఎల్ రాహుల్

By

Published : Dec 7, 2019, 5:42 PM IST

వెస్టిండీస్​పై తొలి టీ20లో అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు టీమిండియా బ్యాట్స్​మన్ కేఎల్ రాహుల్. అయితే వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ గురించి ఇప్పుడే ఆలోచించట్లేదని.. అందుకు ఇంకా సమయం ఉందని అన్నాడు.

"కొన్ని సిరీసుల తర్వాత టాపార్డర్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నా. వెస్టిండీస్‌పై తొలి టీ20లో రాణించా. తర్వాత వాటిలోనూ ఇలానే ఆడాలనుకుంటున్నా. వచ్చే ఏడాది అక్టోబర్‌ గురించి ఆలోచించట్లేదు. ఇంకా సమయముంది. ఎన్నో మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇక్కడ వికెట్‌.. బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా లేదు. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినప్పుడు ఎదురుదాడికి దిగుతూ బ్యాటింగ్‌ చేయాలి. గెలవాలంటే పది రన్‌రేటుతో పరుగులు చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలోనే ఒకటి రెండు బౌండరీలతో విరుచుకుపడితే తర్వాత పని సులువవుతుంది. బౌండరీలు బాదాలనే ప్రణాళికతో బరిలోకి దిగాం. విరాట్ అద్భుతంగా పోరాడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు" -కేఎల్ రాహుల్, భారత క్రికెటర్

విండీస్​తో శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత్.. 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ(94 నాటౌట్)తో పాటు కేఎల్‌ రాహుల్ (62) కీలక పాత్ర పోషించాడు. సారథితో కలసి శతక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు రాహుల్. టీ20ల్లో వేగంగా వేయి పరుగులు సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. టీమిండియా తరఫున టీ20ల్లో వేయి పరుగులు పూర్తి చేసిన ఏడో బ్యాట్స్‌మన్​గా నిలిచాడు.

భారత బ్యాట్స్​మన్ కేఎల్ రాహుల్

ABOUT THE AUTHOR

...view details