తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీమ్ఇండియా భవిష్యత్ సారథి రాహుల్'

టీమ్​ఇండియా భవిష్యత్ సారథిగా కేఎల్ రాహుల్ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపాడు మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా. అతడు కెప్టెన్​గా పనికొస్తాడా లేదా అన్న విషయం ఈ ఐపీఎల్​తో తెలుస్తుందని వెల్లడించాడు.

KL Rahul could lead the Team India says Aakash chopra
'టీమ్ఇండియా భవిష్యత్ సారథి రాహుల్'

By

Published : Sep 14, 2020, 7:01 PM IST

టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆ బాధ్యతల నుంచి తప్పుకునే సరికి కేఎల్‌ రాహుల్‌ తర్వాతి సారథిగా రెడీగా ఉంటాడని మాజీ క్రికెటర్, క్రికెట్‌ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. తాజాగా ఫేస్‌బుక్‌లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా ఆకాశ్ ఈ విధంగా పేర్కొన్నాడు. ఈ ఐపీఎల్‌లో రాహుల్‌.. కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ కెప్టెన్‌గా ఎలా రాణిస్తాడు, అలాగే భవిష్యత్‌లో భారత్‌ను ఎలా నడిపిస్తాడనే విషయాలపై చోప్రా స్పందించాడు.

"కోహ్లీ, రోహిత్‌ ఒకే వయసు కలవారు. ఒక స్థాయికి వచ్చేసరికి వారిద్దరూ కెప్టెన్లుగా కనిపించరు. కెప్టెన్సీ విషయంలో మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఎలాగైతే జట్టు పగ్గాలను కోహ్లీకి అప్పగించాడో.. అలాగే అతడు కూడా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరికి ఇవ్వక తప్పదు. అప్పుడు రాహుల్‌ మాత్రమే ముందు వరుసలో ఉంటాడు. రాహుల్‌ కెప్టెన్‌గా ఎలా పనికొస్తాడనే విషయం ఈ ఐపీఎల్‌తో తెలుస్తుంది. ఇప్పటివరకూ అతడి ఆట, వ్యవహారశైలిని బట్టి కెప్టెన్‌గా రాణిస్తాడనే నమ్మకంతో ఉన్నా. మంచి సారథిగా గుర్తింపు సాధిస్తాడని అనుకుంటున్నా."

-ఆకాశ్ చోప్రా, క్రికెట్ వ్యాఖ్యాత

మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే మెగా లీగ్ కోసం కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ ఈసారి గట్టిగానే సాధన చేస్తోంది. కొత్త కోచ్‌ అనిల్‌ కుంబ్లే సారథ్యంలో రాహుల్‌ జట్టు తీవ్రంగా చెమటోడ్చుతోంది. ఎలాగైనా కప్పు గెలవాలని పట్టుదలతో కనిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details